Yellareddypet: ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్‌ను సందర్శించిన మేడిపల్లి సత్యం

Yellareddypet: ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్‌లో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ పనితీరును పరిశీలించి వైద్యులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు.

KALEEM, SIRICILLA
Updated on: 21 Oct 2026 9:23 PM IST
Yellareddypet
X

Yellareddypet: ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్‌ను సందర్శించిన మేడిపల్లి సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న కోరుట్లపేటకు చెందిన వ్యక్తిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. అనంతరం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన గుండె సంబంధిత చికిత్సల కోసం క్యాథ్ ల్యాబ్ పనితీరును ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ సత్యనారాయణ స్వామి, డాక్టర్ అభినయ్‌తో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు.

ఇప్పటివరకు ఆస్పత్రిలో సుమారు 100 గుండె సంబంధిత చికిత్సలు, స్టెంట్ల అమరిక ప్రక్రియలు నిర్వహించినట్లు వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధునాతన గుండె వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తున్న అశ్విని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సత్యనారాయణ స్వామి, డాక్టర్ అభినయ్‌లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA