Korutla: కోరుట్లలో గడి బురుజు స్థలాల పరిరక్షణ కోసం ఎమ్మెల్యే సంజయ్ ధర్నా!
Korutla: జగిత్యాల జిల్లా కోరుట్లలో గడి బురుజు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కుల సంఘాలు భారీ ధర్నా నిర్వహించాయి.
Korutla: కోరుట్లలో గడి బురుజు స్థలాల పరిరక్షణ కోసం ఎమ్మెల్యే సంజయ్ ధర్నా!
Korutla: జగిత్యాల జిల్లా కోరుట్లలో 'గడి బురుజు' స్థలాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగాయి. మున్సిపాలిటీ కేటాయించిన VLT నంబర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రక 'గడి బురుజు' స్థలాల పరిరక్షణ కోసం పోరుబాట పట్టారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. స్థానిక వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలతో కలిసి ఆయన ఆందోళన బాట పట్టారు. గడి బురుజుకు సంబంధించిన సుమారు 5 వేల గజాల స్థలాన్ని కబ్జాల బారి నుండి కాపాడాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ... మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన VLT (Vacant Land Tax) నంబర్లను వెంటనే రద్దు చేయాలని ఖరాకండిగా స్పష్టం చేశారు. దాదాపు 5,000 గజాల ఈ విలువైన స్థలాన్ని వ్యక్తుల స్వార్థానికి కాకుండా, కోరుట్ల పట్టణ ప్రజల ఉమ్మడి అవసరాలకు, ప్రజా వినియోగానికి మాత్రమే ఉపయోగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తులను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
కుల సంఘాల మద్దతుతో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన ఈ ధర్నాతో కోరుట్లలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి అధికారు స్పందించి VLT నంబర్లను రద్దు చేస్తారో లేదో వేచి చూడాలి.




