Jagtial: రోల్లవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే!
Jagtial: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రోల్లవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి చివరి ఆయకట్టు పంటలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నీటిని విడుదల చేశారు.
Jagtial: రోల్లవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే!
Jagtial: బీర్పూర్ మండలంలోని చివరి ఆయకట్టు వరి పంటలకు చివరి తడి నీరందించేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం రోల్లవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.
రైతులు, మండల నాయకుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి దిగువ ప్రాంతాలకు నీరందించాలని ఆదేశించారు. పంటలు ఎండిపోకుండా సకాలంలో స్పందించి నీరు విడుదల చేసినందుకు ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రాంచందర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ కొల్వాయి నవీన్ రావు, సర్పంచ్ హరీష్, ఉప సర్పంచ్ ఏనుగంటి జితేందర్, కృష్ణ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజుగోపాల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారపాక రమేష్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.




