Jagtial: జగిత్యాలలో స్వయం ఉపాధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్!
Jagtial: ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ లబ్ధిదారులకు రూ.50,000 చొప్పున స్వయం ఉపాధి చెక్కులను అందజేశారు.
Jagtial: జగిత్యాలలో స్వయం ఉపాధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్!
జగిత్యాల: మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ తెలిపారు.
‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం (2025–26)’లో భాగంగా జగిత్యాల అర్బన్ మండలంలోని మోతే, దరూర్ గ్రామాలకు చెందిన ముస్లిం మైనారిటీ మహిళలకు మంజూరైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు. మోతే గ్రామానికి చెందిన షేక్ బీబీ (కిరాణా షాపు), దరూర్ గ్రామానికి చెందిన షబానా (టైలరింగ్ బోటిక్)లకు రూ.50,000 చొప్పున చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంపన్న దేశాల్లో సైతం ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యపడవు అని, స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడమే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు. మహిళల సాధికారత, ఆర్థిక పురోగతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో R SETI ద్వారా మహిళలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి రంగంలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాసవి, పాక్స్ చైర్మన్ దామోదర్ రావు, సర్పంచ్ మహేష్, నాయకులు ములసపు మహేష్, మతులాపురం శేఖర్, సంజీవ్, రఘు, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు మరియు మైనారిటీ మహిళలు పాల్గొన్నారు.




