Korutla: 10వ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్!

Korutla: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Oct 2026 4:22 PM IST
Korutla
X

Korutla: 10వ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్!

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు, అయిలాపూర్, యూసుఫ్‌నగర్ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యార్థుల చదువు, పాఠశాలలో విద్యా వాతావరణం, వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలని సూచించారు. పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధమై మంచి మార్కులు సాధించాలని తెలిపారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ చదువుతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కష్టపడి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్