Odela: సూపర్ ఎల్నినో ముప్పు.. ఆరుతడి పంటలే వేయాలి
Odela: ఓదెల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు. సూపర్ ఎల్నినో దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు.
Odela: సూపర్ ఎల్నినో ముప్పు.. ఆరుతడి పంటలే వేయాలి
ఓదెల: ఓదెల మండలం గుండ్లపల్లి, కనగర్తి, మడక,ఓదెల, పెద్ద కోమిరె,భీమరపుపల్లి,పోత్కపల్లి గ్రామాల్లో ఐకేపీ,సింగిల్ విండో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ రాష్ట ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.
పోత్కపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హకా ఫార్మర్ సర్వీస్ సెంటర్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సూపర్ ఎల్నినో కారణంగా భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. యాసంగిలో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సమృద్ధిగా పండే మొక్కజొన్న (మక్కలు), శెనగ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
దలారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు మండలంలో ఐకేపీ మరియు సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని ధాన్యం కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచనలు చేశారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.




