Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ముమ్మర ఏర్పాట్లు!

Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ నేతన్నల సంక్షేమం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

KALEEM, SIRICILLA
Published on: 29 Sept 2026 8:02 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ముమ్మర ఏర్పాట్లు!

సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సభా స్థలంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సభా స్థలాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తున్నారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల్లో ఉత్సాహం నెలకొందన్నారు.

గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలో అమలు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నేతన్నలు, రైతులు, మహిళలు, పేదలు, ఇతర అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

రేపటి సీఎం పర్యటనలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA