Sircilla: సీఎం పర్యటన: సిరిసిల్లలో హెలిప్యాడ్, సభాప్రాంగణం ఏర్పాట్ల పరిశీలన!

Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మంగళవారం రాత్రి హెలిప్యాడ్, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ గరిమ అగ్రవాల్.

KALEEM, SIRICILLA
Published on: 29 Sept 2026 9:53 PM IST
Sircilla
X

Sircilla: సీఎం పర్యటన: సిరిసిల్లలో హెలిప్యాడ్, సభాప్రాంగణం ఏర్పాట్ల పరిశీలన!

సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న ఏర్పాట్లను మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి పరిశీలించారు.

సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు అండ్ వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, వేముల వీరేశం, బల్మూరి వెంకట్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిద్ధం చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించిన అనంతరం.. అంబేద్కర్ జంక్షన్, నేతన్న జంక్షన్ మీదుగా ముఖ్యమంత్రి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి ప్రయాణించే రహదారి వెంబడి చెత్తాచెదారం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం బహిరంగ సభ ప్రాంగణంలో స్టేజీ, గ్యాలరీలు, శిలాఫలకాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

సభకు వచ్చే ప్రజలు, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్రాంతాలను కూడా పరిశీలించారు. పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కె.ఎస్.బి. కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ బీమ్లా నాయక్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA