Peddapalli: గోదావరి పుష్కర ఘాట్ పనులు నాణ్యతతో వేగవంతం చేయాలి.
Peddapalli:
Peddapalli: గోదావరి పుష్కర ఘాట్ పనులు నాణ్యతతో వేగవంతం చేయాలి.
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని పర్యటనలో భాగంగా పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్న మంత్రి.. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అంతకన్నా ముందు మంథని పట్టణంలోని గ్రౌండ్ లో మంత్రి శ్రీధర్ బాబు సరదాగా వాకింగ్ చేసి, టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడారు. ఆ తర్వాత గోదావరి నది వద్ద ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలు, మిగిలి ఉన్న పనుల వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
మంథని నియోజకవర్గంలో గోదావరి నది తీరంతో పాటు పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మంథనిలో అభివృద్ధి పనులు చేస్తుంటే కొంతమందికి పచ్చ కామెర్ల రోగులకు లోకం పచ్చగా కనిపించినట్లు కనిపిస్తోందని విమర్శించారు.మంథని అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు.అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించకుండా విమర్శలను పక్కనపెట్టి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. మంథనికి అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ విద్యాసంస్థను తీసుకువచ్చామని
త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఐటీఐ విద్యాసంస్థను తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ పనుల నాణ్యత,గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తులు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల్లో ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.
నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.భవిష్యత్తులో గోదావరి పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ఘాట్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు.తాము చేపడుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. అలాంటి విమర్శలను పట్టించుకోకుండా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.




