Tangallapalli: కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
Tangallapalli: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులతో సరదాగా ముచ్చటించి, స్వీట్లు పంపిణీ.
Tangallapalli: కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
Tangallapalli: తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో మంజూరు చేయించిన తంగళ్లపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన మంత్రి.. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. వారి చదువులు, యోగక్షేమాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని మంత్రి సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులతో మంత్రి సరదాగా ముచ్చటిస్తూ పాటలు పాడించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాటలు పాడుతూ మంత్రితో ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థుల చిరునవ్వులు, వారి ప్రతిభను ప్రోత్సహించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.




