Saidapur: ఇందిరమ్మ ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి వేడుకలు

Saidapur: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సరిత-శ్రీనివాస్ కుటుంబంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి జరుపుకున్నారు.

RAJU, HUZURABAD
Published on: 9 Nov 2026 7:39 PM IST
Saidapur
X

Saidapur: ఇందిరమ్మ ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి వేడుకలు

కరీంనగర్ జిల్లా: సైదాపూర్ మండలం ఎలబోతారంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు సరిత–శ్రీనివాస్ కుటుంబంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి పండుగ ఆనందాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులకు స్వీట్లు అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి టపాకాయలు, కాకర ఒత్తులు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో పండుగ వేళ ఆనందాలను పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD