Manthani: మంథనిలో రేపు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన

Manthani: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం మంథనిలో పర్యటించి, 302 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 600 మందికి కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు.

SHANKAR, MANTHANI
Published on: 17 Oct 2026 4:27 PM IST
Manthani
X

Manthani: మంథనిలో రేపు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన

మంథని: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం (అక్టోబర్ 18) రోజున మంథని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంథనిలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో అలీఫ్, డీఆర్డీఏ, మెప్మా, సీఎస్ఆర్ సంస్థల సహకారంతో కుట్టు శిక్షణ పూర్తి చేసిన 600 మందికి మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు 3,040 మందికి ఉచిత కుట్టు శిక్షణ అందించి, సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన సుమారు కోటి రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని 302 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో మంత్రి చేతుల మీదుగా అందజేయనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మెప్మా ఆధ్వర్యంలో మహిళా ఇందిరా శక్తి పథకం కింద మంజూరైన నూతన ఆయిల్ మిల్లును మున్సిపల్ కార్యాలయం మార్గంలో ప్రారంభించనున్నారు. అనంతరం మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI