Manthani: మంథని, రామగిరి మండలాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి!

Manthani: మంథని, రామగిరి మండలాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

SHANKAR, MANTHANI
Published on: 16 Nov 2026 12:23 PM IST
Manthani
X

Manthani: మంథని, రామగిరి మండలాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మంథని, రామగిరి మండలాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం రాత్రి పరామర్శించారు.

మంథని మండలం గాజులపల్లిలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తల్లి అల్లం బుచ్చమ్మ మృతి చెందగా, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అదేవిధంగా రామగిరి మండలం బుధవారంపేటలో కాంగ్రెస్ నాయకుడు కొమురయ్య గౌడ్ తల్లి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రాంకుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు.

వీరితో పాటు నియోజకవర్గంలోని పలువురు మృతుల కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు అర్ధరాత్రి వరకు పరామర్శిస్తూ, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI