Dharmapuri: ఎస్ఐఆర్‌పై మంత్రి అడ్లూరి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: బీజేపీ!
Dharmapuri: కరీంనగర్‌లో బీజేపీ నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ధర్మపురి బీజేపీ నేతలు ఖండించారు.
Dharmapuri: ఎస్ఐఆర్‌పై మంత్రి అడ్లూరి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: బీజేపీ!
ధర్మపురి: కరీంనగర్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR (Special Intensive Revision) కార్యక్రమంపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ధర్మపురి బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అనవసరమైన అపోహలు సృష్టించేలా ఉన్నాయని తీవ్రంగా ఖండించారు.
SIR ప్రక్రియలో ఎక్కడైనా పొరపాట్లు లేదా అవకతవకలు జరిగితే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు.... అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పుడు, బీజేపీ చెబితేనే ఓట్లు తొలగిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.... ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హమైన నమోదులను నిబంధనల ప్రకారం పరిశీలించడం ఎన్నికల వ్యవస్థ బాధ్యత అని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల హక్కులను కాపాడాలని కోరుతున్నామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మకంగా పోరాడటానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అయితే వాస్తవాలను పక్కనపెట్టి ఇష్టానుసారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుమందాస్ సత్యనారాయణ, జిల్లా ఎండోమెంట్ కో-కన్వీనర్ కలకోట రాజు, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు కొత్తకొండ రాజు, పట్టణ ఉపాధ్యక్షులు సుంకు మధుసూదన్, వెలగందుల ప్రణీత్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు అప్పం శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు ఆనందాస్ నవీన్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కాసెట్టి హరీష్ తదితరులు పాల్గొన్నారు.




