Metpally: ఓటు చోరీలో మొదటి బాధితున్ని నేనే..మంత్రి అడ్లూరి లక్ష్మణ్!
Metpally: మెట్‌పల్లిలో మార్కెట్ కమిటీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. దేశంలో ఓటు చోరీపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Metpally: ఓటు చోరీలో మొదటి బాధితున్ని నేనే..మంత్రి అడ్లూరి లక్ష్మణ్!
Metpally: బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఓటు చోరీలో మొదటి బాధితున్ని నేనే అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ కార్యాలయ నూతన భవనాన్ని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, పిసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావుతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఓటు చోరీలో ఆధారాలతో వెళ్తున్న రాహుల్ గాంధీనీ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో బీజేపీకి,నరేంద్ర మోదీకి మూడింది అని ఎద్దేవా చేశారు. ఓటు చోరీలో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే మోదీ స్పందన లేదని, హోమ్ శాఖ స్పందించదు అని అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు.




