Peddapalli: డ్రగ్స్ మోజులో పడి భవిష్యత్ అంధకారం చేసుకోవద్దు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
Peddapalli: డ్రగ్స్ మోజులో పడి భవిష్యత్ అంధకారం చేసుకోవద్దు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా బొమ్మారెడ్డిపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో, పోలిస్ శాఖ అద్వర్యంలో ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తో కలసి పాల్గొన్నారు.
నషా తో వచ్చే పర్యవసానాలపై, ప్రముఖ బంజారా కళాకారుడు ఎస్పీ నాయక్ తో తల్లిదండ్రులకు అవగహన కల్పించారు. ఇదే కార్యక్రమంలో ఎస్పీ నాయక్ కళా బృందం సభ్యులకు ప్రోత్సాహకంగా చెక్కులకు పంపిణీ చేశారు. అనంతరం ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 87 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసారు.
ఈ సందర్బంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ. డ్రగ్స్, గంజాయి తోపాటు ఇతర మత్తుపదార్థాల మోజులో పడి నేటి యువత తమ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రజలు బాగస్వాములై, మత్తుపదార్థాలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలనీ పిలుపినిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి నాయక్, ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ తోపాటు సర్పంచ్ రాజ్ కుమార్,మరియు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.




