Dharmaram: ముంపు గ్రామం చామనపల్లిలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Dharmaram: పెద్దపల్లి జిల్లా చామనపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు.

RAMESH, DHARMPURI
Published on: 27 Oct 2026 5:02 PM IST
Dharmaram
X

Dharmaram: ముంపు గ్రామం చామనపల్లిలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పెద్దపల్లి జిల్లా: ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో మంగళ వారం రోజున సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి పర్యటించారు. అక్కడికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. చామనపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించడం పై గ్రామ సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు, ఉప సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో మంత్రికి గజమాలతో సన్మానించారు.

అనంతరం గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, లక్ష్మణ్ కుమార్,ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు చిత్ర పటలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా తో మాట్లాడుతూ :- మేడారం రిజర్వాయర్ నీటి సామర్ధ్యం పెంపు తో చామనపల్లి గ్రామం గత 10 ఏండ్లుగా రిజర్వాయర్ నీటితో ఇబ్బందులు పడుతుండటంతో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వంద శాతం చామన పల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించండం పై సంతోషంగా ఉందన్నారు.

గ్రామ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి ,ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చామన పల్లికి పూర్తి ముంపు హోదాకు సుమారు 350 నుండి 400 కోట్ల అవసరం పడుతుందని ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామాన్ని ఆర్ & ఆర్ ప్యాకేజీ కోసం ముఖ్య మంత్రి వద్ద తన వంతు గా కృషి చేసి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

గ్రామస్తుల కోరిక మేరకు వారికి కాలనీ ఏర్పాటు చేయడం జరుపుతామని మంత్రి పేర్కొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI