Karimnagar: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

Karimnagar: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ అన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కలెక్టరేట్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి స్వచ్ఛతా హీ సేవా పోస్టర్ల ఆవిష్కరణ.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 17 Sept 2026 7:28 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

కరీంనగర్: వ్యాధుల బారిన పడకుండా.. ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల పోస్టర్ ను మంత్రి, కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాసరెడ్డి, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డిఓ షర్మిల, డీఆర్డీఓ గీత తదితర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శుభ్రతకు పెద్దపీట వేస్తూ.. ప్లాస్టిక్ నిర్మూలన, చెత్త చెదారం తొలగింపునకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాలు శుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని పేర్కొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN