Peddapalli: సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వేదికలపై బీఆర్ఎస్ అవినీతి బట్టబయలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గొర్రెల బీమాపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాలాభిషేకం. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామంటూ సీఎం సభలపై ప్రకటన.

RAMESH, DHARMPURI
Published on: 30 Sept 2026 4:02 PM IST
Peddapalli
X

Peddapalli: సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వేదికలపై బీఆర్ఎస్ అవినీతి బట్టబయలు!

Peddapalli: తొమ్మిది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అవినీతిని ప్రజల ముందు ఉంచడానికి సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గొర్రెలు మేకలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పించిన సందర్భంగా గొర్రెల పెంపకదారుల సంఘం,అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గొల్ల కురుమల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీమా పథకానికి అన్నారు. గతంలో ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగిందని మంత్రి తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు.

తొమ్మిది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అవినీతిని ప్రజలకు వివరించడానికి సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నరని అన్నారు.

ఇందులో భాగంగా సిరిసిల్లలో పార్ట్ వన్ అవినీతి, సిద్దిపేటలో పార్ట్ టూ అవినీతి, గజ్వేల్ లో పార్ట్ 3 అవినీతిని బయట పెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI