Peddapalli: నీళ్ల విషయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు అవగాహన లేదు: కొప్పుల!
Peddapalli: నీళ్ల విషయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎలాంటి అవగాహన లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నంది రిజర్వాయర్ వద్ద విమర్శించారు.
Peddapalli: నీళ్ల విషయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు అవగాహన లేదు: కొప్పుల!
పెద్దపల్లి జిల్లా: ధర్మారం మండలం నంది రిజర్వాయర్ వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు....
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.... నీళ్ల విషయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎలాంటి అవగాహన లేదన్నారు.... తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించి ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్లు మూసుకున్నారని విమర్శించారు.....
ఇదే విషయంపై హరీష్ రావు ప్రశ్నిస్తే ఆయనపై తిట్ల దండకం మొదలు పెట్టారన్నారు.... తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచుకుంటుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.... ప్రశ్నించినందుకు హరీష్ రావు, కేటీఆర్‌పై తిట్ల దండకం చేస్తున్నారన్నారు....
ధర్మపురిలో 20 ఏండ్లలో ఒక్క ఎకరం ఎండిన దాఖలాలు లేవన్నారు.... బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరం ఎండినట్టు చూపిస్తావా అని సవాల్ విసిరారు.... 14 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి రైతులను ఆదుకున్నామన్నారు.... ఇప్పుడు మోటర్లు రిపేర్లు చేసే సోయి కూడా ప్రభుత్వానికి లేదన్నారు....
ధర్మపురిలో పంటలు ఎండిపోతుంటే ఎక్కడ ఉన్నావని ప్రశ్నించారు.... నంది మేడారం రిజర్వాయర్ నుండి ధర్మపురికి నీళ్లు ఇవ్వలేదని అంటున్న అడ్లూరికి లెఫ్ట్, రైట్ కెనాల్స్ కనిపించడం లేదా అని నిలదీశారు....
మూడేండ్ల నుండి గడ్డిపీకుతున్నవా.... అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని ఎద్దేవా చేశారు.... రైతులు చస్తే నీకేంటి, నువ్వు మాత్రం రాజభోగాలు అనుభవించు అన్నారు... బీఆర్ఎస్ హయంలో చేసిన పనులు తప్ప నువ్వు చేసింది ఒక్క పని కూడా లేదన్నారు.
కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చారని, ఇవన్నీ కళ్లకు కనపడడం లేదా అన్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టే సోయి లేదని, రైతులు గతి లేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు.... ధర్మపురిలో ఉన్న 360 గ్రామాల్లో ఒక్క పని చేశావా అని, కొప్పుల ఈశ్వర్ మార్క్ ప్రతి గ్రామంలో కనపడుతుందన్నారు.
నీకే కాదు నీ నాయకులకు, మీ ముఖ్యమంత్రికి కూడా సోయి లేదని, ప్రజా సమస్యలంటే కాంగ్రెస్‌కు పట్టింపు లేదని విమర్శించారు.




