Jagtial: జగిత్యాల మెడికల్ కాలేజీని సందర్శించిన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సంజయ్

Jagtial: జగిత్యాల మెడికల్ కాలేజీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ANAND, JAGITYAL
Published on: 10 Oct 2026 8:33 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల మెడికల్ కాలేజీని సందర్శించిన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల: జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం వైద్య విద్యార్థులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కళాశాలలో ఎదురవుతున్న మౌలిక వసతుల కొరత, భవన నిర్మాణాలలో జరుగుతున్న జాప్యంపై విద్యార్థులతో వివరంగా చర్చించారు. ప్రస్తుతం తగిన భవనాలు లేకపోవడంతో రేకుల షెడ్లలోనే తరగతులు నిర్వహిస్తున్నారని, దీనివల్ల తాము పడుతున్న తీవ్ర ఇబ్బందులను విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. నిర్మితమవుతున్న భవనాల పనులు త్వరలోనే పూర్తవుతాయని స్పష్టం చేశారు. కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను త్వరితగతిన కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన స్పష్టమైన హామీ పట్ల వైద్య విద్యార్థులు హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL