Sircilla: సిరిసిల్లలో అక్టోబర్ 6న మినీ జాబ్ మేళా.. ఫోన్‌పేలో కొలువులు!

Sircilla: సిరిసిల్లలో అక్టోబర్ 6న మినీ జాబ్ మేళా ఫోన్‌పే సంస్థలో 50కి పైగా ఉద్యోగ ఖాళీలు ఇంటర్ అర్హత, నెలకు రూ. 20 వేల వేతనం.. ఐడీవోసీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు.

KALEEM, SIRICILLA
Published on: 3 Oct 2026 6:53 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో అక్టోబర్ 6న మినీ జాబ్ మేళా.. ఫోన్‌పేలో కొలువులు!

సిరిసిల్ల: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ సంస్థ ఫోన్‌పేలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 6న మంగళవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లోని జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, రూమ్ నంబర్ F-16లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీ. నిర్మల తెలిపారు.

ఫోన్‌పే సంస్థలో రూరల్ బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ (RBDA) లేదా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్‌ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 50కి పైగా ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వేతనంతో పాటు ESI, EPF సౌకర్యాలు కల్పించనున్నారు. పనితీరు ఆధారంగా రూ.50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ ఉద్యోగాలకు బైక్, స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో అక్టోబర్ 6న ఉదయం 11 గంటలకు మినీ జాబ్ మేళాకు హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి బీ. నిర్మల కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్‌పే సిరిసిల్ల సెల్: 9010784112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA