Sircilla: సిరిసిల్లలో మహిళలకు మినీ జాబ్ మేళా.. రూ.17 వేల వరకు వేతనం

Sircilla: సిరిసిల్ల ఐడీవోసీలో నవంబర్ 11న మహిళలకు మినీ జాబ్ మేళా జరగనుంది. రూ.17 వేల వేతనంతో ఉద్యోగాలకు అర్హులైన వారు హాజరుకావాలని జిల్లా ఉపాధి శాఖ కోరింది.

KALEEM, SIRICILLA
Published on: 9 Nov 2026 5:59 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో మహిళలకు మినీ జాబ్ మేళా.. రూ.17 వేల వరకు వేతనం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (IDOC) ఉన్న ఎంప్లాయిమెంట్ కార్యాలయం (F-16)లో ఈ జాబ్ మేళా జరగనుంది.

ప్రముఖ సంస్థ సాయి ఆద్యంత్ ఎంటర్‌ప్రైజెస్‌లో అసెంబ్లీ హెల్పర్స్, వేర్‌హౌస్ ఆపరేటర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి బి. నిర్మల తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా లేదా నాన్ టెక్నికల్ డిగ్రీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వరకు వేతనంతో పాటు వసతి, రవాణా తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి హాజరుకావాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి సూచించారు. మరిన్ని వివరాలకు 9959066600, 7382794374 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA