Peddapalli: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం!

Peddapalli: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ విప్ విజయరమణారావు గురువారం ప్రారంభించారు.

RAJU, PEDDAPALLI
Published on: 26 Nov 2026 6:28 PM IST
Peddapalli
X

Peddapalli: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం!

Peddapalli: తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం పెద్దపల్లి ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో ప్రారంభమైంది.

హరే రామ హరే కృష్ణా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై భోజన పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు 18 లక్షల 88 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు, వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.800 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI