Metpally: చిన్నారికి విజన్ స్కూల్ భరోసా: పదో తరగతి వరకు ఉచిత విద్య
Metpally: మెట్‌పల్లి విజన్ స్కూల్ యాజమాన్యం తల్లిని కోల్పోయిన ఒకటో తరగతి విద్యార్థిని మానవితకు పదో తరగతి వరకు పూర్తి ఉచిత విద్యను ప్రకటించి ఆదర్శంగా నిలిచింది.
Metpally: చిన్నారికి విజన్ స్కూల్ భరోసా: పదో తరగతి వరకు ఉచిత విద్య
మెట్టుపల్లి: ఇటీవల Vision School, Metpallyలో ఒకటవ తరగతి చదువుతున్న గాజులపేట, మెట్పల్లి రెండవ వార్డుకు చెందిన వేలుముల మానవిత తల్లిగారు అనారోగ్యంతో మరణించడం ఎంతో బాధాకరం.
తల్లి లేని ఆ చిన్నారి భవిష్యత్తు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, వారి కోరిక మేరకు మానవిత చదువు వారికి భారం కాకూడదనే గొప్ప సంకల్పంతో Vision School యాజమాన్యం ముందుకు వచ్చింది.
ఈరోజు మానవిత కుటుంబాన్ని పరామర్శించి, ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు పూర్తి ఉచిత విద్యను అందించనున్నట్లు తెలియజేస్తూ లేఖను అందజేయడం జరిగింది.
ఈ మానవతా కార్యక్రమానికి గజ్జి మహేష్ (Founder & Principal) మరియు నత్తి శేఖర్ (Correspondent) ముందుకు వచ్చి, ఆ చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం జరిగింది.
విద్య అనేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు… ఒక జీవితానికి వెలుగునిచ్చే మార్గం. ఒక చిన్నారి చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో, ఆ కుటుంబానికి అండగా నిలవడం మా బాధ్యతగా భావిస్తున్నామని గజ్జి మహేష్ తెలిపారు.




