Metpally: కంప్యూటర్ బాక్స్‌లో పాము ప్రత్యక్షం: పరుగులు తీసిన ఉద్యోగులు!

Metpally: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో కంప్యూటర్ బాక్స్‌లో పాము కనిపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 4 Nov 2026 9:30 PM IST
Metpally
X

Metpally: కంప్యూటర్ బాక్స్‌లో పాము ప్రత్యక్షం: పరుగులు తీసిన ఉద్యోగులు!

మెట్టుపల్లి: మెట్టుపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో పాము ప్రత్యక్షం కావడంతో ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.నూతనంగా కార్యాలయానికి వచ్చిన కంప్యూటర్ బాక్స్‌లో పాము దాగి ఉండటాన్ని గమనించిన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో ఆయన కార్యాలయానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసుకెళ్లారు.

దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా,సబ్ ట్రెజరీ కార్యాలయం చుట్టూ చెట్ల పొదలు,పిచ్చిమొక్కలు విస్తారంగా ఉండటంతో తరచూ పాములు కార్యాలయ పరిసరాల్లోకి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విధులు నిర్వహించే సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఉద్యోగులు భయపడుతున్నారు.

కార్యాలయ పరిసరాల్లో పాముల సంచారం పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయం చుట్టూ ఉన్న చెట్ల పొదలు, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA