Metpally: 12వ వార్డులో ప్రజల సౌకర్యార్థం నూతన బోరు ఏర్పాటు

Metpally: మెట్‌పల్లి పట్టణంలోని 12వ వార్డులో తాగునీటి ఎద్దడి నివారణకు కౌన్సిలర్ సుమయ్య తబస్సుం ముఖీం ప్రత్యేక చొరవతో నూతన బోరును ఏర్పాటు చేయించారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 15 Nov 2026 9:24 PM IST
Metpally
X

Metpally: 12వ వార్డులో ప్రజల సౌకర్యార్థం నూతన బోరు ఏర్పాటు

మెట్టుపల్లి: మెట్టుపల్లి పట్టణంలోని 12వ వార్డులో ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోరు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో వార్డు కౌన్సిలర్ సుమయ్య తబస్సుం ముఖీం ప్రత్యేక చొరవ తీసుకొని, తన సహకారంతో బోరు ఏర్పాటు చేయించారు.

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా వార్డులో అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బోరు ఏర్పాటు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, తమ అవసరాన్ని గుర్తించి సహకరించిన కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా అవసరాలే లక్ష్యంగా.. వార్డు అభివృద్ధికి కృషి కొనసాగిస్తామని కౌన్సిలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మోసిన్, సలీం మహిళలు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA