Metpally: మున్సిపల్ కార్మికులతో ఇంటి పనులా?: ఎమ్మెల్యే సంజయ్‌పై ఫైర్!

Metpally: మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వాడుకున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ క్షమాపణ చెప్పాలని మెట్‌పల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ రైస్ డిమాండ్ చేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 11 Nov 2026 6:09 PM IST
Metpally
X

Metpally: మున్సిపల్ కార్మికులతో ఇంటి పనులా?: ఎమ్మెల్యే సంజయ్‌పై ఫైర్!

మెట్టుపల్లి: మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత ఇంటి పనులకు వినియోగించుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ రైస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా ఇద్దరు మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే తన నివాసంలో వంట మనిషిగా, డ్రైవర్‌గా వాడుకున్నారని, గతంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కూడా తొమ్మిది మంది కార్మికులను వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

కార్మికులకు ప్రజాధనం నుంచి చెల్లించిన జీతాల మొత్తాన్ని లెక్కించి 10 రోజుల్లోగా ఎమ్మెల్యే నుంచి రికవరీ చేయాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ ఆస్తుల ఆదాయ వనరులు, నివాస భవనాలు, హైదరాబాద్‌లోని విల్లాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

కమిషనర్‌కు ధన్యవాదాలు: కాంగ్రెస్ విజ్ఞప్తితో ఆ కార్మికులను ఎమ్మెల్యే ఇంట నుండి తొలగించి తిరిగి మున్సిపల్ విధుల్లోకి తీసుకున్న కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్లు బత్తుల నరేష్, మాసర ప్రవీణ్, అజీమ్, అజయ్, నరేష్, మహేష్ తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA