Metpally: పట్టణ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రిలే దీక్ష
Metpally: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు.
Metpally: పట్టణ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రిలే దీక్ష
మెట్ పల్లి: మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆందోళన బాట పట్టింది.జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులు అభివృద్ధికి నోచుకోక ప్రజల అవస్థలు పడుతున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు.పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారి పక్కన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనుపురావు,జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబుతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొని ఆందోళన నిర్వహించారు.ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్న ఇలాంటి అభివృద్ధి నోర్చుకోక పట్టణం వెనుకడుగు వేస్తుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మెట్ పల్లి పట్టణంలో చెరువు సుందరీకరణ పనులు, వార్డులలో సిసి రోడ్లు,మురుగు కాలువలు చేపట్టాలని కోరుతూ పురపాలక భాజపా కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నిర్మాణాలకు భూమి పూజ చేసి ఏడాది గడుస్తున్న ఇప్పటికీ ఏ పని ప్రారంభించకపోవడం ప్రభుత్వ పనితీరుకు అడ్డం పడుతుందని ఏద్దేవ చేశారు.
పురపాలక ఎన్నికలు జరిగి పది నెలల పైన గడుస్తున్న ప్రజల సమస్యల కు పరిష్కారం దొరకక ప్రజలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.




