Metpalli: విధుల కేటాయింపులో వివక్షపై మెట్‌పల్లి మున్సిపల్ కార్మికుల ధర్నా!

Metpalli: మెట్‌పల్లి మున్సిపాలిటీలో విధుల కేటాయింపులో వివక్షపై కాంట్రాక్ట్ కార్మికుల సడన్ ధర్నా. చైర్మన్, కమిషనర్ హామీతో నిరసన విరమణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 3:53 PM IST
Metpalli
X

Metpalli: విధుల కేటాయింపులో వివక్షపై మెట్‌పల్లి మున్సిపల్ కార్మికుల ధర్నా!

Metpalli: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో విధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సడన్ ధర్నాకు దిగారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీ వేదికగా కాంట్రాక్ట్ కార్మికులు పోరుబాట పట్టారు. రోజువారీ విధుల కేటాయింపులో కొందరు అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరికే అనుకూలమైన పనులు అప్పగిస్తూ, తమ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

అక్కడికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్‌తో కార్మికులు వాగ్వాదానికి దిగారు. తమకు జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. విధి నిర్వహణలో అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, వివక్షను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దీంతో కార్యాలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌తో కలిసి కార్మికులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. సమస్యలను పరిష్కరిస్తామని, విధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్, కమిషనర్ల సర్దిచెప్పడంతో శాంతించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్