Metpally: మెట్‌పల్లిలో ఘనంగా మెగా జాబ్ మేళా: యువతకు ఉద్యోగ అవకాశాలు!

Metpally: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చొరవతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 14 Nov 2026 3:16 PM IST
Metpally
X

Metpally: మెట్‌పల్లిలో ఘనంగా మెగా జాబ్ మేళా: యువతకు ఉద్యోగ అవకాశాలు!

Metpally: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో నిరుద్యోగ యువతీయువకుల కోసం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది యువత భారీగా తరలివచ్చారు.

​ఈ మెగా జాబ్ మేళాలో ఐటీ (IT), ఫార్మా (Pharma), ఫైనాన్స్, సోలార్ రంగాలకు చెందిన పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హతల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు.

​జాబ్ మేళా ప్రాంగణంలోని ప్రతి స్టాల్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్వయంగా పరిశీలించారు. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఉద్యోగ అవకాశాలు, వేతన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్వ్యూలకు హాజరైన యువతీయువకులతో ముచ్చటించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. స్థానిక యువతకు సొంత ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

​ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన పలువురు అభ్యర్థులకు కంపెనీల ప్రతినిధులు అక్కడికక్కడే నియామక పత్రాలను (Offer Letters) అందజేశారు. తమ ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై నిరుద్యోగ యువత మరియు వారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA