Medaram: ఉద్యమకారుల హక్కుల సాధనకు మేడారంలో మహాపాదయాత్ర!
Medaram: తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం సమ్మక్క–సారలమ్మ సాక్షిగా మేడారంలో చలో మేడారం మహాపాదయాత్ర నిర్వహించారు. మేనిఫెస్టో హామీలు అమలు చేయాలని సంజీవరెడ్డి డిమాండ్ చేశారు.
Medaram: ఉద్యమకారుల హక్కుల సాధనకు మేడారంలో మహాపాదయాత్ర!
మేడారం: మేడారం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి, అలుపెరుగని పోరాటాలు సాగించిన ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఎక్కటి సంజీవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు 22న మేడారంలో నిర్వహించిన ‘సమ్మక్క–సారలమ్మ చలో మేడారం’మహాపాదయాత్రలో 33 జిల్లాల నుండి స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
చలో మేడారం మహాపాదయాత్ర అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ.రానున్న MLC ఎన్నికల్లో TUF ఉద్యమకారులు పోటీ చేయాలని కోరారు. మరియు GHMC హైదరాబాద్,వరంగల్,అదేవిధంగా MPTC ZPTC ఎన్నికల్లో అన్ని పార్టీలు 20% రిజర్వేషన్ల ను కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన హామీలను అమలు చేయడంలో కేకే కమిటీ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు రానున్న రోజుల్లో అన్ని పార్టీల MLA క్యాంపు ఆఫీస్ లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ డిమాండ్లకు TUF రాష్ట్ర కమిటీ కూడా మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎక్కడ సంజీవరెడ్డి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఆరే రమేష్ రెడ్డి.
మద్దూరి శంకరయ్య జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ నర్ర భూమిరెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ రాజబాబు మండల ఉపాధ్యక్షులు, రచ్చ గణేష్ మీడియా కన్వీనర్ పాత సత్యం ex సర్పంచ్ కనుమల్ల రాజేందర్ ex సర్పంచ్. మాజీ ఎంపీటీసీ పాతకాల ఓదెలు బిట్ల రమేష్ బిట్ల శ్రీనివాస్ కొంగరి రవీందర్.తదితరులు పాల్గొన్నారు.




