Karimnagar: దుర్షేడ్‌లో రూ. 4 లక్షల నిధులతో బోర్ వెల్ పనులకు భూమి పూజ

Karimnagar: కరీంనగర్ 4వ డివిజన్ దుర్షేడ్‌లో మేయర్ వై. శ్రీనివాస్ పర్యటన. రూ. 4 లక్షల నిధులతో బోర్ వెల్ పనులకు స్థానిక కార్పొరేటర్‌తో కలిసి భూమి పూజ.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 31 Oct 2026 6:43 PM IST
Karimnagar
X

Karimnagar: దుర్షేడ్‌లో రూ. 4 లక్షల నిధులతో బోర్ వెల్ పనులకు భూమి పూజ

కరీంనగర్: గ్లోబల్ వామింగ్, ఎల్ నినో ప్రభావ దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి, త్రాగు నీటి సరఫరా లో భాగంగా శనివారం 4 వ డివిజన్ లో మేయర్ పర్యటించారు. దుర్షెడ్ లో స్థానిక కార్పోరేటర్ భూపతి రవీందర్‌తో కలిసి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 లక్షలతో దుర్షేడ్ నేతకాని సంఘం, క్వార్టర్స్‌లోని ఎస్సీ కాలనీలో రెండు చోట్ల నూతన బోర్ వెల్స్ నిర్మాణ పనులకు భూమీ పూజ చేసి ప్రారంభించారు.

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగర ప్రజల త్రాగు నీటి అవసరాలను తీర్చడమే నగరపాలక సంస్థ ప్రధాన బాధ్యత అన్నారు. ఇందులో భాగంగానే నూతన విలీన గ్రామాల డివిజన్ల త్రాగు నీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను బట్టి బోర్ వెల్స్ నిర్మాణం తో పాటు మంచి నీటి సరఫరా పైపు లైన్ పనులు చేపట్టి త్రాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు మా పాలకవర్గం చర్యలు తీస్కుంటుందని తెలిపారు.

విలీన గ్రామాల డివిజన్ల త్రాగు నీటి కోసం ఇప్పటికే అమృత్ 2.0 పథకంలో మంచి నీటి పైపులైన్ లు, ఓహెచ్ఆర్ లు నిర్మాణం చేస్తున్నామని... త్వరలోనే పనులు పూర్తి చేసి విలీన గ్రామాల ప్రజలకు త్రాగు నీటి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా నూతనంగా విలీనం చెందిన గ్రామాల డివిజన్ల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు బోర్ వెల్స్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పనులను అధికారులు ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం చర్యలు చేపట్టాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ భూపతి రవీందర్, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR