Karimnagar: పారిశుధ్య తనిఖీలు చేపట్టిన మేయర్ కొలగాని శ్రీనివాస్!

Karimnagar: కరీంనగర్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పారిశుధ్య తనిఖీలు చేపట్టారు. రోడ్లు, పరిసరాల్లో చెత్త వేస్తే రూ.1000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 29 Oct 2026 2:02 PM IST
Karimnagar
X

Karimnagar: పారిశుధ్య తనిఖీలు చేపట్టిన మేయర్ కొలగాని శ్రీనివాస్!

Karimnagar: ​నగర పారిశుధ్య నిర్వహణను మరింతగా మెరుగు పరచాలని సిబ్బంది, కార్మీకుల పనితీరును మెరుగు పరుచుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య నిర్వహణ లో భాగంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ నగర పరిశుభ్రత, సిబ్బంది కార్మీకుల పనితీరు పై అకస్మిక తనిఖీ చేశారు. నగరంలోని 66 డివిజన్ పరిదిలో స్థానిక కార్పోరేటర్ వంగల పవన్ తో కలిసి టవర్ సర్కిల్ ప్రాంతం మొత్తం పాదయాత్ర తో సుడిగాలి పర్యటన చేసి పారిశుధ్య పనుల తీరును స్వయంగా పరిశీలించారు.

సిబ్బంది పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, పరిసర ప్రాంతాల్లో చెత్త వేసే వారిని గుర్తించి రూ. 1000 జరిమానాలు విధించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సంబంధిత అధికార సిబ్బంది పై కఠణచర్యలు తప్పవని హెచ్చరించారు.

మొదటగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణతో పాటు టవర్ సర్కిల్, పాత శివాలయం ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికుల బయోమెట్రిక్,హాజరు పాయింట్లతో పాటు హాజరు రికార్డులను తనిఖీ చేసి కార్మికుల హాజరును స్వయంగా పరిశీలించారు. విధుల హాజరయ్యే ముందు సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నగర పరిశుభ్రత పనుల తీరు, చెత్త సేకరణ విధానంపై ఆరా తీశారు. పారిశుధ్య పనులను మరింత మెరుగ్గా చేసేందుకు కార్మికులు, సిబ్బంది కి సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం కార్పోరేటర్ వంగల పవన్‌, పారిశుధ్య అధికారులతో కలిసి టవర్ సర్కిల్ కమర్షియల్ ప్రాంతంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం మొదలుకొని అన్నపూర్ణ కాంప్లెక్స్, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, పాస్‌పోర్ట్ ఆఫీస్, శనివారం మార్కెట్ రైతు బజార్, పాత శివాలయం తదితర వీధుల్లో వీధి వీధినా తిరుగుతూ పారిశుధ్య నిర్వహణను నిశితంగా పరిశీలించారు.

పలు వీధుల్లో చెత్త కుప్పలు (GVP పాయింట్లు) పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్లు, డ్రెయిన్లలో ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న స్థానిక ప్రజలు, వ్యాపారులు, దుకాణదారు పై ప్రత్యేక దృష్టి పెట్టి నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి రూ. 1000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగర పారిశుధ్య నిర్వహణ అధికారులు, సిబ్బంది, కార్మీకుల ప్రధాన బాధ్యత అన్నారు. నిర్దేశిత సమయం ప్రకారం నివాస గృహాలు, ఇతర సముదాయాల వద్ద స్వచ్చ ఆటోల ద్వారా డోర్ టూ డోర్ చెత్త సేకరణ జరిగేలా అధికారులు చర్యలు తీస్కోవాలన్నారు. ప్రజలు నిత్యం వివిధ పనుల నిమిత్తం సందర్శించే ప్రాంతమైన టవర్ సర్కిల్ ఏరియాతో పాటు డివిజన్ మొత్తం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

నగర పరిసరాలు, రోడ్ల పై చెత్త వేసే వారిని గుర్తించి వారికి 1000 నుండి 5 వేల వరకు జరిమానాలు తప్పక విధించాలన్నారు. పారిశుధ్య పనుల పట్ల అధికారులు సిబ్బంది బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తించాలని నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిణచర్యలు తప్పవని హెచ్చరించారు. నగర మరియు టవర్ సర్కిల్ ప్రాంత ప్రజలు మీ చుట్టు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థ స్వచ్చ ఆటో కార్మీకులకు మాత్రమే చెత్తను వేరు చేసి అందించాలని తెలిపారు.

రోడ్లు పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తే మున్సిపల్ చట్ట ప్రకారం జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. చెత్త సేకరణకు స్వచ్చ్ ఆటోలు సమయం ప్రకారం వచ్చేలా జవానులు చర్యలు తీస్కోవాలన్నారు. జీవీపి పాయింట్లను జవానులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మీకులు విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని తెలిపారు.

నగర పరిసరాలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా కార్మీకుల చర్యలు తీస్కోవాలన్నారు. ప్రధాన నైట్ స్పీపింగ్ కార్మీకులు ప్రధాన రహదారులు, రోడ్లను పరిశుభ్రపరిచి ఎక్కడ గార్బేజ్ లేకుండ చూడాలన్నారు. నగర పారిశుధ్య పనులను మరింత మెరుగు పరిచి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలన్నారు. మురుగునీటి కాలువల్లో చెత్త వేయకుండా అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ రాజమనోహర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, జవానులు నర్సయ్య, శ్రీనివాస్, పారిశుధ్య కార్మీకులు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR