Sircilla: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి.. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ!
Sircilla: సిరిసిల్లలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.
Sircilla: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి.. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ!
Sircilla: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాజన్న జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.
భారత తొలి విద్యాశాఖ మంత్రిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప విద్యావేత్తగా దేశానికి సేవలందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను స్మరించుకున్నారు. విద్య ప్రాధాన్యతను గుర్తిస్తూ విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో మదర్సాలో చదువుతున్న పిల్లలకు విద్యా సామగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ పర్వేజ్ వార్షి, ఉపాధ్యక్షుడు మహమ్మద్ సలీం, అన్సార్ అలీ, అడ్వకేట్ మహమ్మద్ కలీమ్ తదితరులు పాల్గొన్నారు.




