Vemulawada: శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది.

BABU, VEMULAWADA
Published on: 19 Nov 2026 1:08 PM IST
Vemulawada
X

Vemulawada: శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

​దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా, బుధవారం 8వ రోజు వేడుకలను ఆలయ పర్యవేక్షకులు శ్రీ శ్రీనివాస్ శర్మ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా, ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సుహాసినుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు మరియు శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి సభ్యులకు ఆలయ అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, వాయనంతో పాటు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు మరియు అర్చకులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA