Jagtial: అర్థరాత్రి చిన్నారి కోసం ప్లేట్లెట్స్ దానం చేసిన మర్రిపెల్లి మురళి!

Jagtial: జగిత్యాల ఆశా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల చిన్నారి కోసం అర్థరాత్రి 4 గంటలకు ఓ నెగటివ్ ప్లేట్లెట్స్ దానం చేసి మర్రిపెల్లి మురళి మానవత్వం చాటారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 5 Nov 2026 8:01 AM IST
Jagtial
X

Jagtial: అర్థరాత్రి చిన్నారి కోసం ప్లేట్లెట్స్ దానం చేసిన మర్రిపెల్లి మురళి!

Jagtial: అర్థరాత్రి అత్యవసర సమయంలో 5 సంవత్సరల చిన్నారి కోసం అరుదుగా దొరికే (O-) ఓ నెగటివ్ ప్లేట్లెట్స్ అత్యవసరంగా కావాలని వాట్సాప్ గ్రూప్ లలో వచ్చిన సమాచారం చూసి అర్థరాత్రి ఒంటి గంటకు మహమ్మద్ బాబుజన్, ఎనుగందుల ఉదయ్ కుమార్, అరెల్లి సంజీవ్ డోనార్స్ ని వెతుకుతూ సత్తేక్కపల్లి గ్రామానికి చెందిన శాశ్వత రక్తదాత, సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్రిపెల్లి మురళిని సంప్రదించగా మురళి ప్లేట్లెట్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.

జగిత్యాల పట్టణంలోని ఆశ చిల్డ్రన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 5సంవత్సరల వేదన్షి అను చిన్నారికి రాత్రి 4 గంటలకు అత్యవసరంగా (O-) ఓ నెగటివ్ ప్లేట్లెట్స్ దానం చేసిన సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మర్రిపెల్లి మురళి.

రోజు సమయంలో ప్లేట్లెట్స్ ఇవ్వడానికే భయపడతారు అలాంటిది అర్థరాత్రి సత్తేక్కపల్లి గ్రామం నుండి జగిత్యాల వరకు వెళ్లి 45వ సారి ప్లేట్లెట్స్ దానం చేసిన మర్రిపెల్లి మురళిని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతల అనుసంధాన కర్తలు మహమ్మద్ బాబుజాన్, ఉదయ్ కుమార్, సంజీవ్, సేవ్ ఫౌండేషన్ సభ్యులు, పేషెంట్ బంధువులు, స్నేహితులు అభినందించారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA