Manthani: అల్లం బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించిన సాహితీవేత్తలు
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లిలో ఇటీవల మృతి చెందిన అల్లం బుచ్చమ్మ కుటుంబాన్ని కవులు, సాహితీవేత్తలు పరామర్శించి నివాళులర్పించారు.
Manthani: అల్లం బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించిన సాహితీవేత్తలు
మంథని: ఇటీవల మృతి చెందిన అల్లం బుచ్చమ్మ కుటుంబ సభ్యులను పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు శనివారం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బుచ్చమ్మ కుమారులు అల్లం రాజయ్య, అల్లం వీరయ్యతో పాటు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణను. కూతురు కుదిరే లక్ష్మి లను కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం అల్లం బుచ్చమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పరామర్శించిన వారిలో కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు ఏలేశ్వరం వెంకటేశం, పుట్ట రాజన్న, మందల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.




