Manthani: మండలంలోని పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు.
Manthani: మండలంలోని పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు గోదావరిఖనీ వాసవి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాశీపేట వెంకటమ్మ మాట్లాడుతూ.. విద్యార్థులకు సహాయం చేయడం అభినందనీయం అన్నారు.
ఇదే విధంగా మరింత సహకారం అందించాలని కోరారు. క్లబ్ అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం శిరీష, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




