Manthani: మంథని శివారు పత్తి చేనులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని మల్లెపల్లి డిగ్రీ కళాశాల వద్ద పత్తి చేనులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHANKAR, MANTHANI
Published on: 29 Nov 2026 5:11 PM IST
Manthani
X

Manthani: మంథని శివారు పత్తి చేనులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మంథని సమీపంలోని మల్లెపల్లి డిగ్రీ కళాశాల వద్ద ఉన్న పత్తి చేనులో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరైనా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పడేశారా? లేక సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే మృతుడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరోవైపు పత్తి చేనులో మృతదేహాన్ని చూసిన అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI