Manthani: పెండం లస్మక్క అంత్యక్రియల్లో పాల్గొన్న టీపీయూఎస్ నేతలు!

Manthani: మంథనికి చెందిన పెండం లస్మక్క అంత్యక్రియల్లో టీపీయూఎస్ జిల్లా నాయకులు, పద్మశాలి ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

SHANKAR, MANTHANI
Published on: 26 Oct 2026 7:04 PM IST
Manthani
X

Manthani: పెండం లస్మక్క అంత్యక్రియల్లో పాల్గొన్న టీపీయూఎస్ నేతలు!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన పెండెం సోదరులు - మంథని మార్కండేయ ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పెండం నరేందర్, తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం (టీపీయూఎస్) పెద్దపల్లి జిల్లా పబ్లిసిటీ సెక్రెటరీ పెండం సత్యనారాయణ, మంథని పద్మశాలి వీధికి చెందిన మెకానిక్ పెండం శ్రీధర్ గార్ల మాతృమూర్తి శ్రీమతి పెండం లస్మక్క గారు(78) సోమవారం ఉదయం స్వర్గస్తులయ్యారు.

విషయం తెలుసుకున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల కోటేశం, ఉపాధ్యక్షులు ఆర్టీసీ సీనియర్ డ్రైవర్ బండి శ్రీనివాస్, ప్రాథమిక సభ్యులు తాటిపాముల కృష్ణ, నల్ల సంపత్, రాపెల్లి శ్రీనివాస్, పద్మశాలి సంఘ నాయకులు పినకాని రాజమల్లు, మాజీ కౌన్సిలర్ వడ్లకొండ రవి, బరిబద్దల సమ్మయ్య, గజ్జెల్లి రాజమల్లు,

దాసరి శ్రీనివాస్, పంచాయత్ రాజ్ ఇంజనీర్లు శారద, విజయసారధి, సుమలత, సహచర ఉద్యోగులు మనోహర్ రెడ్డి, అరుణ్, నర్సింగం ఆంజనేయులు, తిరుపతి, స్వర్ణలత తదితరులు మంథని పద్మశాలి వీధిలోని వారి స్వగృహానికి వెళ్లి పెండం లస్మక్క గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలతో నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పద్మశాలి వీధి నుండి గోదావరి నది ఒడ్డు వరకు జరిగిన అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాలకు హాజరయ్యారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI