Manthani: మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజును పరామర్శించిన దుద్దిళ్ళ శీను బాబు

Manthani: కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తండ్రి సాంబయ్య మృతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శీను బాబు.

SHANKAR, MANTHANI
Published on: 22 Oct 2026 6:31 PM IST
Manthani
X

Manthani: మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజును పరామర్శించిన దుద్దిళ్ళ శీను బాబు

మంథని: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజును, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శీను బాబు గురువారం పరామర్శించారు.

బుధవారం వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య మృతిచెందగా సాంబయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంబయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. సాంబయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు.

ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్, మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, గాండ్ల మోహన్, రాజు రెబల్, గడప కృష్ణమూర్తి, మల్యాల తిరుపతి, తీగల రాజయ్య గౌడ్, కటకం రవీందర్, కటకం నారాయణ, సయ్యద్ ఇక్బాల్, లల్లు, తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI