Manthani: పోలీస్ ఉచిత కోచింగ్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు దుద్దిళ్ల శ్రీనుబాబు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
Manthani: పోలీస్ ఉచిత కోచింగ్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్లో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల సాధనలో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మన ఊరు – మన కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని తెలిపారు.
శ్రీ విశ్వ అకాడమీ సహకారంతో అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోచింగ్ సెంటర్లో అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందించడంతో పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ మంత్రి శ్రీధర్ బాబు వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు.
దాదాపు 120 రోజులుగా కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుతూ, పట్టుదలతో సాధన చేస్తూ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబు చేపడుతున్న కార్యక్రమాలు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు, మంథని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు.




