Manthani: ఎంపీ గడ్డం వంశీపై అనవసర ఆరోపణలు మానుకోవాలి

Manthani: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై మంత్రి శ్రీధర్ బాబు నిరాధార విమర్శలు మానుకోవాలని మంథనిలో విజ్ఞప్తి. విశాఖ ట్రస్ట్ ద్వారా వంశీ సేవలు అందిస్తున్నారని వెల్లడి.

SHANKAR, MANTHANI
Published on: 10 Nov 2026 5:12 PM IST
Manthani
X

Manthani: ఎంపీ గడ్డం వంశీపై అనవసర ఆరోపణలు మానుకోవాలి

మంథని: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ పై అనవసరమైన విమర్శలు, ఆరోపణలు చేయడం మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికైనా మానుకోవాలని గడ్డం వంశీ అభిమాన కార్యకర్త చిత్తవేణి హరీష్ ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకులు, మూడున్నర సంవత్సరాల కాలంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీ గడ్డం వంశీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి పరిశీలించాలని ఆయన కోరారు.

ఆయన చేసిన పనులు, ప్రజలకు అందించిన సేవలు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ తెలుసని తెలిపారు. తమ కార్యకర్తలతో వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టించి ఎంపీపై విమర్శలు చేయించడం, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించడం సరైన పద్ధతి కాదన్నారు. రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి పనుల ద్వారా సమాధానం చెప్పడం ఉత్తమమన్నారు.

ముఖ్యంగా గడ్డం వంశీకృష్ణ తన విశాఖ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని చెప్పారు. అనేక ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఏర్పాటు చేయించడం, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్న వ్యక్తిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ఎంపీ చేస్తున్న పనులను అడ్డుకోవడం కాకుండా అభివృద్ధి పనుల్లో పోటీపడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI