Manthani: మంథని ఫోటోగ్రాఫర్ కు అంతర్జాతీయ గుర్తింపు!

Manthani: మంథని పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ తూర్పాటి సత్యనారాయణ తీసిన చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

SHANKAR, MANTHANI
Published on: 19 Nov 2026 12:06 PM IST
Manthani
X

Manthani: మంథని ఫోటోగ్రాఫర్ కు అంతర్జాతీయ గుర్తింపు!

Manthani: మంథని పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, రవి వర్మ ఫోటో స్టూడియో యజమాని తూర్పాటి సత్యనారాయణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.

ఫ్రాన్స్, ఇటలీ, మొనాకో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక రామోగే ఫోటో కాంటెస్ట్ 2026 - ది మ్యాన్ అండ్ ది సీ పోటీలో ఆయన తీసిన బోండా మహిళ తాగుతోంది అనే ఫోటోకు ప్రత్యేక ప్రస్తావన లభించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వేలాది మంది ఫోటోగ్రాఫర్లు పంపిన ఫోటోలలో సత్యనారాయణ ఫోటో అంతర్జాతీయ జ్యూరీని ఆకట్టుకుంది.

సముద్రంతో మనిషికి ఉన్న అనుబంధాన్ని, గిరిజన మహిళ జీవన విధానాన్ని ఆయన తన కెమెరాలో అద్భుతంగా బంధించారని నిర్వాహకులు ప్రశంసించారు. ఈ అవార్డు ప్రధానోత్సవం డిసెంబర్ 4, 2026న మొనాకోలోని ప్రపంచ ప్రసిద్ధ ఓషనోగ్రాఫిక్ మ్యూజియంలో జరగనుంది.

ఈ వేడుకలో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు పాల్గొని విజేతలను సత్కరించనున్నారు. అనంతరం కాక్టెయిల్ పార్టీ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా తూర్పాటి సత్యనారాయణ మాట్లాడుతూ మంథని లాంటి చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తెలంగాణ ఫోటోగ్రాఫర్లందరికీ గర్వకారణమని అన్నారు. మంథని పట్టణ ప్రజలు, ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు సత్యనారాయణకు అభినందనలు తెలియజేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI