Manthani: జాతీయ స్థాయిలో సత్తా చాటిన మంథని ఫొటోగ్రాఫర్ కోటారి శ్రీనివాస్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఫొటోగ్రాఫర్ కోటారి శ్రీనివాస్ జాతీయ స్థాయి ఫోటో ట్రేడ్ షోలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

SHANKAR, MANTHANI
Published on: 6 Oct 2026 5:32 PM IST
Manthani
X

Manthani: జాతీయ స్థాయిలో సత్తా చాటిన మంథని ఫొటోగ్రాఫర్ కోటారి శ్రీనివాస్!

Manthani: ఫొటోగ్రఫీ రంగంలో ప్రతిభతో పాటు ఏఐ ఎడిటర్‌గా సేవలందిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్ పల్లి గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ కోటారి శ్రీనివాస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఫొటో ట్రేడ్‌ షో సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి భారత్ కళా పురస్కార్–2026 కార్యక్రమంలో శ్రీనివాస్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

జాతీయ స్థాయిలో నిర్వహించిన వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఏఐ ఎడిటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆయనకు ది బెస్ట్ ఏఐ ఎడిటర్ అండ్ వెడ్డింగ్ వీడియోగ్రఫీ అవార్డుతో పాటు భారత్ కళా పురస్కార్–2026 అవార్డును నిర్వాహకులు, ఫొటోగ్రఫీ పరిశ్రమ ప్రముఖులు, సినీ నటుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ వీడియోగ్రఫీ అవార్డులతో పాటు భారత్ కళా పురస్కార్–2026 అందుకోవడం ఎంతో ప్రత్యేకమైన విషయమన్నారు. తన ప్రతిభను గుర్తించి పురస్కారాలతో సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఫొటోగ్రఫీ ప్రయాణంలో ప్రోత్సాహం, సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎం.సి. శేఖర్, ట్రేడ్‌ షో నిర్వాహకులు ఎడిట్‌ పాయింట్ రమేష్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, తెలంగాణ మాజీ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సినీ నటులు, దేశవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI