Manthani: సహకార సంఘం ద్వారా రైతులకు రూ.26 లక్షల దీర్ఘకాలిక రుణాలు!
Manthani: మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు రూ.26 లక్షల దీర్ఘకాలిక రుణాల చెక్కులను చైర్మన్ కొత్త శ్రీనివాస్ అందజేశారు.
Manthani: సహకార సంఘం ద్వారా రైతులకు రూ.26 లక్షల దీర్ఘకాలిక రుణాలు!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని సహకార సంఘం ద్వారా రైతుల ఆర్థిక అవసరాల కోసం దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నట్లు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. శనివారం సంఘ కార్యాలయంలో సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంఘ కార్యదర్శి బొద్దుల సమ్మయ్య ల చేతుల మీదుగా రూ.26 లక్షల విలువగల దీర్ఘకాలిక రుణాల చెక్కులు అందజేశారు.
షీప్ లోన్ కింద మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన జీల్ల వజ్రమ్మ కు రూ.5 లక్షలు, కర్షకమిత్ర ద్వారా విలోచవరం గ్రామానికి చెందిన కొండ శంకరయ్యకు రూ.10 లక్షలు, కొండ సమర సేన్ కు రూ.5 లక్షలు, నాగారం గ్రామానికి చెందిన మారేపల్లి భాస్కర్ రెడ్డి కి రూ.6 లక్షల చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పెట్టుబడులతో పాటు ఇతర అవసరాలకు ఆర్థిక చేయూత అందించేందుకు సంఘం ద్వారా వివిధ రకాల దీర్ఘకాలిక రుణాలు అందజేస్తున్నామని తెలిపారు సంఘ సభ్యులు ఈ రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
అర్హులైన సంఘ సభ్యులు అవసరమైన పత్రాలతో పీఏసీఎస్ మంథని కార్యాలయాన్ని సంప్రదించి రుణ సదుపాయాలను పొందాలని కొత్త శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.




