Manthani: మంథనిలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంతో పాటు బోయిన్‌పేట, పరిసర గ్రామాల్లో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 13 Nov 2026 1:39 PM IST
Manthani
X

Manthani: మంథనిలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

మంథని: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంతో పాటు బోయిన్ పేట ఇతర పరిసర గ్రామాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో నాగుల పుట్టల వద్దకు చేరుకొని పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమ, పూలతో నాగదేవతను భక్తితో పూజించారు.

కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని నాగదేవతను వేడుకున్నారు. పెళ్లయిన మహిళలు సంతానం కోసం ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు, పెద్దలు సైతం కుటుంబ సమేతంగా ఆలయాలకు, నాగుల పుట్టల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

నాగుల చవితి సందర్భంగా ఆలయాలు, నాగదేవత విగ్రహాల వద్ద భక్తుల సందడి నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI