Manthani: మంథనిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చైర్మన్ వొడ్నాల
Manthani: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు.
Manthani: మంథనిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చైర్మన్ వొడ్నాల
మంథని: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రేషన్ డీలర్ గుండా ధనలక్ష్మి రేషన్ షాపు పరిధిలోని లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మారుపాక నిహారిక, రవికిరణ్, లైశెట్టి రజిత, రాజు, ఎల్లెంకి వంశీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. రేషన్ కార్డుల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందుబాటులో ఉండేది కాదని, ప్రజాపాలన ప్రభుత్వంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన ఆహారం అందించే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జంభోజు సమ్మయ్య, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




