Manthani: గుంజపడుగులో మహాత్మా గాంధీ విగ్రహం కూల్చివేత.. కలకలం

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయగా గ్రామస్థులు కఠిన చర్యలకు డిమాండ్ చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 28 Nov 2026 10:06 PM IST
Manthani: గుంజపడుగులో మహాత్మా గాంధీ విగ్రహం కూల్చివేత.. కలకలం
X

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం కలకలం రేపింది. గ్రామంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడం విచారకరమని పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, విగ్రహం కూల్చివేతకు గల కారణాలు, ఈ ఘటనకు బాధ్యులెవరనే వివరాలు తెలియాల్సి ఉంది.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI